Blog
బంగారు గొడ్డలి కధ
నమస్తే కధలు చెప్పడం, వినడం రెండు మనందరికీ చాలా ఇష్టమయినవి కదా
కధలు అంటే ఇప్పుడు తల్చుకున్నా కూడా బాల్యం లోకి వెళ్ళిపోతాం … ఎందుకంటే కథలు అంటే అక్కడ అమ్మమ్మ , తాతగారు ఉంటారు …
అసలు ఈ అమ్మమ్మ అనే పేరు ఎవరు కనిపెట్టారో తెలీదు కానీ ఆ మాట గుర్తుకు వస్తే చాలు మూర్తీభవించిన ప్రేమ, మమకారం, ఆప్యాయత , అన్నింటిని మించి మన బాల్యం …
అమ్మమ్మ అంటేనే బాల్యం …
అమ్మమ్మ అంటే భరోసా …
అమ్మమ అంటే .. వంటలు , ముగ్గులు, అల్లికలు , చెట్లు ఎక్కడం , నాటకాలు , స్రిప్ట్ వర్క్ , గోరింటాకు, అట్లతద్ది, సంది గొబ్బెమ్మలు , బొమ్మల పేరంటం, పిండి వంటలు , అరిసెలు, తొక్కుడు లడ్డు ఇవన్నీ అమ్మమ్మ ఉంటేనే కదా …
ఒక కధ అమ్మమ్మ చెప్పడానికి, తాతగారు చెప్పడానికి చాలా తేడా ఉండేది అంతదాకా ఎందుకు మనిషి మనిషికి కధ చెప్పే తీరు మారిపోతుంది .. మనం కధ చెప్పే విధానమే మనం జీవితాన్ని చూసే కోణం .. మన perception …
ఇక ఈ బంగారు గొడ్డలి కధ మొదటిసారి విన్నప్పుడు కూడా నాకు ఎందుకో కొంచం నచ్చలేదు కానీ చిన్నపుడు విన్నాను కాబట్టి అప్పట్లో ఎలా ఉంటే నచ్చుతుందో తెలీదు … కానీ ఆలోచనల్లో మాత్రం ఈ కధ మెదులుతూ ఉండేది ..
రోజు సాయంత్రం హోమ్ వర్క్ అయిపోయాక పిల్లల గ్యాంగ్ మొత్తం కూర్చుని కధలు చెప్పుకునే వాళ్ళం
ఎదురింటి వాళ్ళు, ప్రక్కింటి వాళ్ళు … ఇంకా చెప్పాలంటే ఆ వీధిలో ఉండే పిల్లలందరిని పిలుచుకుని వచ్చేవాళ్ళం మా సంఘానికి మా అమ్మమ్మ అధ్యక్షురాలు …
ఇలా ఒక రోజు కధలు చెప్పుకుంటునే నాకు ఈ ఆలోచన వచ్చింది నదీ దేవత వచ్చి రామయ్యని మెచ్చుకుంది అంటే అతను అందరికన్నా భిన్నంగా ఉండాలి పచ్చని చెట్లు కొట్టకూడదు … అలాగే రోజు పక్షులకి ఆహరం పెట్టాలి … ఇవి రెండు నేను కధకి చేర్చి చెప్పడం మొదలు పెట్టాను ..
ఎందుకనో కేవలం బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి నావి కావు అన్నంతమాత్రాన నదీ దేవత ప్రసన్నం అవడం అంతగా నచ్చలేదు ఇంకేదో ఉండాలి ఇక్కడ .. అప్పుడు అనిపించింది .. గొడ్డలి నీటిలో పడిపోగానే అతను బాధపడటం , నదీ దేవత ప్రత్యక్షం అవడం … వెంటనే రామయ్య తన గొడ్డలి పదునుగా ఉందని నీళ్ళల్లో పడటం వలన ఏ ప్రాణికయినా హాని కలిగిందేమో చూడమని దేవతని అడగాలి … అతనిలో దయ, కరుణ ఉండాలి అప్పుడు దేవత ఆ కానుకలు ఇవ్వాలి ..
రామయ్యకి జరిగింది విని వేరే వాళ్ళు ఆవిధంగా ప్రయత్నం చేయడం , భంగ పడటం అక్కర్లేదని అనిపించింది … పాజిటివ్ గా కధ చెప్పాము … అలాగే రామయ్య ని చూసి ఊరిలో వాళ్ళు ప్రేరణ పొందుతున్నారు అని చెప్పి ముగించేయచ్చు అనిపించింది .. అందుకే కధ అక్కడితో ఆపేసాను … ధన్యవాదాలు .. నమస్తే.
అమ్మమ్మ, తాతయ్య
