Category: బాల్యం – జ్ఞాపకాలు – భోషాణం పెట్టి
Category Archives: బాల్యం – జ్ఞాపకాలు – భోషాణం పెట్టి
అమ్మమ్మ, తాతయ్య
అమ్మమ్మ, తాతయ్య
నా చిన్నప్పటినుంచి ఈ బొమ్మల్ని అలా పిలవడమే నాకు అలవాటు.
నా పుట్టిన రోజు నాడు మా నాన్న గారు ఈ బొమ్మలు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు.
అప్పటికప్పుడే వాళ్ళిద్దరికీ కమలమ్మ , బసవయ్య గారు అని మా అమ్మమ్మ
తాతగార్ల పేర్లు పెట్టేసాను …
ఇక అప్పటినుంచి వాళ్ళు నా జీవితం లో భాగమయిపోయారు.
పొద్దున్నే నిద్ర లేవగానే
అరచేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి అని శ్లోకం చదువుకుని
పాదాలు నేలమీద ఆనించేముందు
సముద్ర వసనే దేవి
పర్వతస్థన మండలే శ్లోకం చదివేసి భూదేవికి దణ్ణం పెట్టుకుని
పక్క బట్టలు మడిచేసి ముఖం కడుక్కున్నాక అప్పుడు వెళ్లి అమ్మమ్మ ,
తాతయ్యలకి గుడ్ మార్నింగ్ చెప్పాలి .
ముఖం కడుక్కున్నాక ఎందుకు చెప్పటం అని ఎవరయినా అడిగితే
ఒకరిని మనం పెద్దవాళ్ళు అనుకున్నాక
వాళ్ళని మన హృదయంలో పీఠం వేసి కూర్చోబెట్టాక మర్యాద ఉండాలి కదా
అందుకే బొమ్మలు అయినా సరే అమ్మమ్మ తాతయ్య అనుకున్నాం కాబట్టి పద్ధతిగా
ఉండాలి అని చెప్పేదాన్ని ..
అయిదు నిమిషాలో పదినిమిషాలో రాత్రి పడుకునేముందు అమ్మ చెప్పిన
సంగతులు అన్ని వాళ్ళకిచెప్పి ఇంకా ఏవయినా మిగిలిపోతే సాయంత్రం స్కూల్
నుంచి వచ్చాక చెప్తాన్లే అని చెప్పేదాన్ని ..
మా అమ్మగారు వారి చిన్నప్పటి సంగతులు ఎన్ని చెప్పేవారో ..
మా బసవయ్య తాతగారి గురించి
వారి వ్యవసాయం … వారికి కుక్కలంటే ఇష్టం అని
ప్రతి మొక్కని, చెట్టుని ఆప్యాయంగా పలకరిస్తారు అని
వాళ్ళ ఎద్దులు , ఆవులు గురించి ఎన్ని కబుర్లో ..
ఇవి అన్ని విన్నప్పుడు మన లీనియేజ్ గురించి ఆలోచిస్తే నాలో ఉన్న ఈ
అభిరుచులు మా బసవయ్య తాతగారి దగ్గరినుంచి వచ్చినవే అని అర్ధం అవుతోంది
ఈ బొమ్మలు నేను ఇష్టపడటానికి ముఖ్యమయిన కారణం…
ఎదుటి వారు ఏదయినా చెప్తున్నప్పుడు ఎలా వినాలో నేర్పుతున్నట్టు ఉంటుంది
మన మనసులో మాట ఏదయినా చెప్పుకోవాలనుకున్నపుడు చిరునవ్వుతో
వింటున్నాం చెప్పు అంటున్నట్టు శ్రద్ధగా ఆలకిస్తారు …
వినడానికి ఆలకించడానికి తేడా ఉంది కదా ..
మనకి ఇప్పుడు ఆలకించేవాళ్ళు కావాలి
మనకి మాటలు ఎక్కువ అయిపోయాయి
వినడం తగ్గిపోయింది …
ఊరికే మాటలు మాటలు మాటలు …
ఎంత మాట్లాడుకుంటున్నామో …ఫోన్స్, వాట్సాప్ , టెలిగ్రామ్ ఎక్కడ చూసినా
మాటలే ఈ మాటల్లో ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాల్లో తెలీదు …
నిజం అనుకుంటే ఏదయినా కష్టం వస్తే ఆ మాట అక్కరకు రాకుండా పోతోంది ..
కానీ వినడం నేర్చుకుంటే ?
చాలా నేర్చుకోవచ్చు … అందులోనే శ్రద్ధగా వినడం నేర్చుకుంటే మరింతగా
నేర్చుకోవచ్చు …
మనం ఏదయినా చెప్పగానే ఎక్కడినుంచో వచ్చే చిరుగాలి సవ్వడికి వాళ్లిద్దరూ
అలా తలాడిస్తారు … మనం చెప్పింది వాళ్ళు విన్నారు అని
సంబరంగా, సంతోషంగా అనిపిస్తుంది.
ఇప్పటికి కూడా వాళ్ళిద్దరికీ ఏదయినా చెప్పుకుంటే
విశ్వానికి చెపుతున్నట్టు ఉంటుంది.
ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే
ప్రతి బొమ్మ వెనుక ఒక కధ ఉంటుంది.
ఒక జ్ఞాపకం ఉంటుంది
.
బాల్యం తాలుకు తీపి గురుతులు ఉంటాయి.
మేము శ్రీరామ్ సమృద్ధి ద్వారా మీ జ్ఞాపకాల భోషాణం నిండా జ్ఞాపకాలు
నింపేందుకు ప్రయత్నం చేస్తున్నాం.
మనం అన్ని రీఫిల్ చేసుకుంటున్నాము.
కానీ మన జ్ఞాపకాల భోషాణం పెట్టె లో జ్ఞాపకాలు తరిగిపోతున్నాయి దానిని రీఫిల్
చేసుకోవడం లేదు.
అలాగే వాటిని పంచుకోకపోతే అవి ముందు తరాల వాళ్ళకి తెలిసే అవకాశం
ఉండదు.
జ్ఞాపకాల్లో మీ బాల్యం ఉంటుంది
అమ్మమ్మ , బామ్మగారు తాతగారు ఉంటారు
మీ స్కూల్ ఉంటుంది .. మీకు చదువు చెప్పిన గురువులు ఉంటారు మీ ఫ్రెండ్స్
ఉంటారు …అప్పటి సమాజం ఉంటుంది … అప్పటి బంధాలు , బాంధవ్యాలు
ఉంటాయి మీరు అక్షరాలూ దిద్దుకున్న పలక ఉంటుంది ..
ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి
మనం వీటిని వంశపారంపర్యంగా తర్వాతి తరాలకి కచ్చితంగా అందించి తీరాలి ..
బొమ్మలు షోకేస్ లోనో బొమ్మల పండగకు పెట్టుకోవడానికి మాత్రమే కాదు
వాటి వెనుక ఉన్న మీ బాల్యం పలకరించండి …
శ్రీరామ్ సమృద్ధి బొమ్మలతో తిరిగి మీ ఖజానా నింపుదాం రండి
మీ బొమ్మల కధలు కూడా మాతో పంచుకోండి ..
